mahivishnupriya

నా భావాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం

ఆలోచింపచేసిన advertisement

on November 19, 2014

ఈ మధ్య టి.వి లో వస్తున్న kinley mineral water ప్రకటన చూడగానే నేను, అమ్మ ఒకరి మొహం ఒకరం చూసుకుని చిన్నగా నవ్వుకున్నాం. ఒక్కసారిగా నా చిన్నతనం గుర్తుకు వచ్చింది.నేను కూడా 9th class చదివేటపుడు అమ్మతో అబద్ధం చెప్పి రాత్రికి నిద్ర పట్టక అర్థరాత్రి తనను లేపి నేను అబద్ధం చెప్పిన విషయం తనతో చెప్పేసి ప్రశాంతంగా తనని గట్టిగా పట్టుకుని పడుకుండిపోయాను.parents తమ ప్రవర్తన ద్వారా నిజాయితీగా ఉండటం పిల్లలకు చిన్నతనం లోనే నేర్పితే ప్రపంచంలో ఇన్ని నేరాలు జరుగుతాయా?చిన్నపుడు బస్సు లో ప్రయాణం చేసేటపుడు పిల్లలకు టికెట్టు కట్టకుండా తప్పించుకోవటానికి పిల్లల వయస్సు తక్కువగా చెప్పడంతోనే అబద్ధపు ప్రయాణం మొదలుపెడితే ఇక ఆ పిల్లలు ఆ parents దగ్గర నుంచి ఏం మంచి తెలుసుకుంటారు.ఒక వ్యక్తి good humanbeing గా ఎదగటంలో తల్లిదండ్రులు,సమాజం ముఖ్యమైన పాత్ర పోషించాలి.కానీ నేటి పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా?ఆ ప్రకటన మాత్రం చాలా నచ్చేసింది.పిల్లలందరూ parents దగ్గర ఇంతే నిజాయితీగా ఉంటే, అలా ఉండగలిగే atmosphere తల్లిదండ్రులు ఏర్పాటు చేయగలిగితే ఎంత బాగుంటుంది.


Leave a comment