mahivishnupriya

నా భావాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం

మనసు వర్షించని మేఘమైనట్లు…

on August 10, 2016

మురిపెంగా పెట్టుకున్న ముగ్గును మొత్తం ఎవరో కాలితో చెరిపేసినట్లు

ఇష్టం గా రాసుకున్న డైరీ పేజీలను ఎవరో కళ్ల ముందే కాల్చేస్తున్నట్లు

పుస్తకాల మధ్యలో ప్రేమగా దాచుకున్న నెమలికన్ను ని ఎవరో ముక్కలుగా చింపేసినట్లు

అమాయకంగా నవ్వే పసిదానికి ఎవరో అకారణంగా చెంపదెబ్బని బహుమతిగా ఇచ్చినట్లు

ఇష్టంగా తిరుగాడిన ఇంటిని ఎవరో కూల్చేసినట్లు

రోజూ ఆప్యాయంగా చూసుకునే  కిటికీ దగ్గరి మరువం మొక్కలను రంగుల పూలు పూయట్లేదనే కారణంతో ఎవరో తీసిపడేసినట్లు

అందంగా కుట్టటం పూర్తైన పూల దండ దారం తెగిపోయి పూలన్నీ చెల్లాచెదురుగా పడిపోయినట్లు

చక్కగా అలంకరించుకున్న కొండపల్లి బొమ్మలను ఎవరో విరిచి పడేసినట్లు

మెలకువ గా ఉండగానే ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్లు

పగలు రాత్రి మనసుకి శూన్యం తప్ప ఇంకేమీ కనిపించనట్లు

విలువైన బంధపు దారం ఏక్కడో తెగేంతలా బలహీనపడుతున్నట్లు


5 responses to “మనసు వర్షించని మేఘమైనట్లు…

  1. Nice poetry with matching photo!

    Like

  2. Lalitha G says:

    అయ్యో – ఇలా రాశారేంటండీ?! Hope all is well !!

    ~Lalitha

    Like

  3. I thought it is only poetry. I hope all is well..

    Like

  4. I hope this is only poetry and all is well. Happy Dussera

    Like

  5. Naga Muralidhar Namala says:

    వర్షానికి ఒక గుణమంది కదండీ. మనం ఆనందంలో ఉన్నప్పుడు హాయిగా అనిస్తుంది. దుఃఖంలో ఉన్నప్పుడు దిగులుగా అనిపిస్తుంది.

    Like

Leave a comment