mahivishnupriya

నా భావాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం

సంక్రాంతి ప్రయాణం

on January 13, 2018

సంక్రాంతి కి ఊరు వెళ్తున్నాం.ఈ రోజు ఈ సంతోషంతో ఉదయం మూడింటికే మెలకువ వచ్చేసింది.చిట్టి చేమంతులు,కాణీ చేమంతులు,బంతిపూలు,చేమంతులు,బంతి పూల లో దాదాపు పది రకాల పూలని,చెరువు ను,ఊరిని,రామయ్య తండ్రిని,సీతమ్మ తల్లిని,గుడిలో ఇంటి పెద్ద లాగ గంభీరంగా కూర్చుని అంతా గమనిస్తున్న శివయ్య ను,నూర్పులు అయ్యాక బస్తాల నిండా నింపిన ధాన్యాన్ని,ఊరు దాటి వెళ్లి పెద్ద పండగ కి ఊరు చేరుకున్న మా లాంటి వలస జీవులను,పండుగను,సందడి ని కనుల నిండా చూసుకుని,ఊరి గాలిని మనసు నిండా పీల్చుకుని,భోగి మంట దగ్గర చలి కాచుకుని,గోదాదేవి కళ్యాణం లో కూర్చుని,సంక్రాంతి కి వాకిలి ని ముగ్గులతో నింపేసి,అమ్మ వండే జంతికలు,వంకాయ పచ్చడి,కమ్మని పోపు వాసన వచ్చే గుమ్మడికాయ కూర,చేమ దుంపల కూర,సంక్రాంతి రోజు ప్రత్యేకంగా అన్ని కూరగాయలు కలిపి చేసే కూర,అత్తమ్మ  చేసే సున్నుండలు అన్నీ ఎటువంటి పరిమితులు లేకుండా తినేసి,వీధిలో అందరూ ఒక దగ్గరకు చేరి మా కల్లంలో వండే అరిసెల వంట దగ్గర కూర్చుని వాళ్లతో కలసి మనస్ఫూర్తిగా నవ్వుకుని,రాత్రి అందరం వరుసగా పడుకున్నపుడు ప్రతీ సంవత్సరం పంచుకునే పెద్ద వాళ్ల ఙాపకాలను ప్రతీ సంవత్సరం లాగానే ఆసక్తిగా వినేసి,నాకు ఎంతో ఇష్టమైన ప్రపంచంలో ప్రతీ క్షణాన్ని మనసారా ఆస్వాదించేసి చివరి రోజు దిగులుగా ఊరు కనిపించేంత వరకు వెనుకకు తిరిగి చూస్తూ వెళుతుంటే చుట్టపుచూపు కోసం ఊరు దాటితే తిరిగి రావచ్చు కానీ బ్రతుకు తెరువు కోసం ఊరు దాటితే తిరిగి రావటం కష్టం అనే బ్రహ్మోత్సవం సినిమా డైలాగ్ గుర్తుకు వస్తుంది మనసు బెంగతో బరువెక్కిపోతుంది.


4 responses to “సంక్రాంతి ప్రయాణం

  1. Lalitha G says:

    ప్రయాణం కబుర్లు కమ్మగా వున్నాయి. పండగకబుర్లు కూడా చదివించండి మరి! మకరసంక్రాంతి శుభకామనలు!

    Like

    • chitralaxman says:

      బ్లాగ్ చదివి అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్ లలిత గారు.పండగ కబుర్లు చెబుదామనుకున్నాను కానీ కుదరలేదండీ.

      Like

  2. anyagaami says:

    you do have an eye for a great picture.

    Like

Leave a comment