అక్కడక్కడ మట్టి అంటుకున్న తెల్లని లాల్చీ,పంచె,భుజం పైన తువ్వాలు,అవసరమైనంతవరకే మాట్లాడటం,ఆప్యాయమైన పలకరింపు,నెమ్మదైన నడక,సైకిల్ పై ప్రయాణం,హనుమంతరావు వ్రాలు అనే సంతకం -ఇవీ హనుమంతరావు గారు అనగానే గుర్తొచ్చేవి.హనుమంతరావు గారు యాభై ఎకరాల భూమిలో రకరకాల పంటలు పండించే రైతు.ఆయన,అతని భార్య పొలంలో కూలీలతో కలసి పొలం పనులు చేసుకునేవారు.ఆయన భార్య పెద్ద కుంకుమ బొట్టు,సిగ చుట్టూ ఎర్రని కనకాంబరాల దండతో ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు.హనుమంతరావు గారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందమ్మా అని తరచుగా అంటుంటారు.రకరకాల పంటలు,వాటి ఖర్చు,పాలేర్ల కూలీ డబ్బులు,పంటల మీద వచ్చే ఆదాయం వీటన్నింటికీ సంబంధించిన లక్షల్లో లావాదేవీలు అన్నీ మా బ్రాంచ్ లోనే జరుగుతాయి.ఎవరినీ ఎప్పుడూ తక్కువగా చూడరు,కించపరచి మాట్లాడరు.డబ్బు తెచ్చినపుడు అవి ఏ పంట నుంచి వచ్చిన ఆదాయమో,తీసుకువెళ్లేటపుడు అవి ఏ ఖర్చు కోసమో ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది.బ్రాంచ్ కి వెళ్ళే దారి లోనే వాళ్ల ఇల్లు.చుట్టూ అరటి చెట్లు,ఇంటి ముందు సంపెంగ,వేప చెట్లు,ఇంటి వెనుక పనస,మామిడి,కొబ్బరి చెట్లు.తోట మధ్యలో ఉన్నట్లుండేది ఇల్లు.
ఇద్దరమ్మాయిలకు పెళ్లి చేసేసారు.అబ్బాయికి ఉద్యోగం వచ్చేసిందమ్మా,మేనకోడలితో పెళ్లి నిర్ణయించాం అని చెప్పారు.ఆ అబ్బాయి కూడా ఒకటి రెండు సార్లు బ్రాంచ్ కి రావటం హనుమంతరావు గారు పరిచయం చేయటం జరిగింది.అబ్బాయి పేరు రమేష్.ఇంకో సారి వాళ్ల అబ్బాయిని,పక్కనే ఉన్న అమ్మాయిని చూపించి ఈ అమ్మాయేనమ్మా మా కాబోయే కోడలు అని పరిచయం చేయటం ఆ అబ్బాయి చిరునవ్వుతో చూడటం,ఆ అమ్మాయి కొంత ఇబ్బందిగా ముఖం పెట్టుకోవటం జరిగింది.కారణాలేవైనా కానీ నెల రోజుల తరువాత హనుమంతరావు గారి ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ రోజు ఊరిలో అందరూ తమ కుటుంబంలోని వ్యక్తికి కష్టమొచ్చినంతగా బాధ పడ్డారు.
ఆ సంఘటన తరువాత హనుమంతరావు గారి భార్య ఇంటి గడప దాటలేదు.అతను మాత్రం ఎప్పటి లాగానే వ్యవసాయం పనులు చేసుకునేవారు.కానీ నడక మరింత నెమ్మదించింది.మాటల స్థానంలో మౌనం చేరింది.కళ్ళలో నిరాశ,బాధ వచ్చి చేరాయి.ఎప్పుడూ మనుషులతో సందడిగా ఉండే ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది.ఎనిమిది నెలల తరువాత మేనకోడలు ప్రేమించిన వ్యక్తితో ఆమె పెళ్లి చేశారు.
సంవత్సరం తరువాత ఒకరోజు వాళ్లింటి ముందు నుంచి వెళుతుంటే పరుగెత్తుకుంటూ నా దగ్గరకి వచ్చారు.అమ్మా మనవడు పుట్టాడు ఎనిమిదేళ్ళ నుంచి పిల్లలు లేని నా కూతురికి,నా కొడుకు చనిపోయిన సంవత్సరం తరువాత కొడుకు పుట్టాడమ్మా.రమేశ్ నా మనవడి రూపంలో మళ్ళీ నా దగ్గరకి వచ్చాడమ్మా అంటూ కళ్ళ నిండా నీటితో సంతోషంగా కనిపించారు.ఆ రోజు ఊరు మొత్తం సంతోషించారు.తరువాత హనుమంతరావు గారు,అతని భార్య వాళ్ల ఇంటి ముందు అరుగులపై ఆ అబ్బాయిని ఆడిస్తూ కనిపించేవారు.మనవడే హనుమంతరావు గారి ప్రపంచమైపోయాడు.మళ్ళీ ఆ ఇంట్లో సందడి,సంతోషం వచ్చి చేరాయి.
Touching …🙏
LikeLike
పోస్ట్ చదివి కామెంట్ పెట్టినందుకు కృతఙతలండీ.
LikeLike
బహుకాలదర్శనం విష్ణుప్రియ గారు. వెల్కం బాక్.
అయ్యో పాపం అనిపించే కథ. కానీ హనుమంతరావు గారి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం / అనవసరం అనిపిస్తుంది (నా అభిప్రాయం). ఇది నిజంగా జరిగిన కథాండి?
LikeLike
తల్లిదండ్రులదగ్గర దొరికిన ప్రేమ భాగస్వామి దగ్గర దొరకకపోతే జీవితం తృణప్రాయంగానే ఉంటుంది.పోనివ్వండి…. భూమికి భారం తగ్గుతుంది.
LikeLike
భూమికి పాపాలు చేసేవారు భారమౌతారు కానీ ఇలాంటి అమాయకులు భారం కారు కదండీ.
LikeLike
అవునండీ చాలా రోజులైంది బ్లాగ్ లో వ్రాసి.ఇది నిజంగా జరిగినదేనండీ.అతను ఆత్మహత్య చేసుకోవటం నిజంగానే అనవసరం అనిపిస్తుందండీ.కానీ అతనికి ఆ క్షణంలో ఆత్మహత్య అనవసరం అనిపించి ఉంటే బాగుండేది.
LikeLike
Enni rojulu ayyindi Andi meeru post chesi. Prathi roju Mee blog open chestuney vuntaanu, kottha post emanna pettaremo ani. Ee roju ki pettaru. Ivvalti post gundello kalukkumanela vundi. Chivariki sukhantham chesaru, lekapothey nidra pattedi kaadu. Thanks. Ilaaney raastu vundandi please.
LikeLike
Thanks Prudhvi garu.
LikeLike
చాలా బావుంది ఈ పోస్ట్! మీరు ఇంకొంచెం తరచుగా రాస్తే ఇంకా చాలా బావుంటుంది 🙂
LikeLike
థాంక్స్ లల్లమ్మా😊.ఇకపై తరచుగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను.
LikeLike