mahivishnupriya

నా భావాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం

పద్మనాభం

on March 5, 2020

పద్మనాభం వెళ్లాల్సి ఉంది ఓ మూడు రోజులు ఈ విషయం తెలియగానే కుంతీమాధవాచార్యుల కుటుంబం నడచిన నేల మీద అడుగుపెట్టబోతున్నానన్న ఉద్వేగం మనసును కమ్మేసింది.కొండ మీద గుడికి వెళ్లగలిగే అదృష్టం ఉందా లేేదా అనే బెంగ నిద్రపోనివ్వలేదు.వేేకువఝాముున ఇంట్లో పూజ చేేస్తున్నపుడు గొంతు విష్ణు సహస్ర నామాలను వల్లె వేస్తున్నా మనసు పద్మనాభం  కుంతీమాధవుని దగ్గర కూర్చుండిపోయింది.పూజ చివరలో మనసు  కొండపైకి వెళ్లగలిగే అదృష్టం కల్పించమని స్వామిని ఆర్తిగా వేడుకుంది.తగరపువలసలో బస్ దిగి ఆటోలో వెెెళ్తుంటే మధ్యలో వచ్చే మజ్జివలస,కురపల్లి ఈ పేర్లు చదువుతుంటే ఇక్కడి నుంచే కదా ఆచార్యులవారి దగ్గరకి వైద్యానికి వచ్చేవారు అనుకున్నాను.కురపల్లి దాటాక దూరాన కొండ మీదకి మెట్లు,గుడి కనిపించాయి ఎంత ఇష్టంగా చూసుకున్నానో.మొదటి రోజు సాయంత్రానికి కుంతీమాధవ స్వామి ఆలయం లోకి వెళ్లగలిగాను.పూజారి గారు లేరు.విశాలమైన ఆలయప్రాంగణం,రామ చిలకలు మంత్రాలు చదువుతూ ప్రదక్షిణ చేస్తున్నట్లు గోపురం చుట్టూ కిిలకిలలాడుతూ ఎగురుతున్నాయి.సుభద్రాచార్యుల వారు,బుల్లిరాజు గారు ఆడుకున్న ఆలయ ప్రాంగణం ఇదే కదూ.బయటకి వస్తుంటే ఫాల్గుణ శుద్ధ ఏకాదశి కళ్యాణోత్సవాల బోర్డ్ ఒకటి కనిపించింది.ఈ కళ్యాణోత్సవాల సమయంలోనే కదూ సుభద్రాచార్యులు,వరదమ్మల పెళ్లి జరిగింది.గుడి బయటకు వచ్చి కొంచెెం ముందుకు వెెళ్తే కొండపై గుడికి మెట్ల దారి,1200 పైబడి మెట్లు.అప్పుడు మెట్లపై నుంచి వెళ్లలేనని తెలిసినా కొన్ని మెట్లు ఎక్కి దిగి సంతోషపడిపోయాను.మెట్లు కాకుండా వాహనాలు వెళ్లే దారి ఉందమ్మా అని నాతో వచ్చిన రాము గారు చెెప్పారు.రేపు నన్ను తీసుకు వెళ్లటం కుదురుతుందా అని అడిగితే అలాగే అన్నారు.రెండవ రోజు టూవీలర్ పై కొండ పైన ఉన్న పద్మనాభ స్వామి గుడికి తీసుకు వెళ్లారు.కొండ పైకి వెళ్లే దారి మొత్తం రాళ్లు.డ్రైవింగ్ లో బాగా అనుభవం లేేేకపోతే ప్రయాణం కొంచెం ప్రమాదమే.అప్పటిికే అక్కడ పూజారిగారు పూజ ముగించుకుని క్రిింద ఊరిలోకి వెళ్లిపోయారంట.మెట్లదారిలో వచ్చిన వాళ్లు బయట పూజ చేస్తున్నారు.నిశ్శబ్ధంగా,ప్రశాంతంగా ఉంది.క్రిందకి చూస్తే గోస్తనీ నది,పచ్చని పొలాలు అందమైన పెయింటింగ్ లా ఉంది.రెండో పంటగా వరి పండుతుంది.అక్కడి నుంచి ఫోన్ చేసి కృష్ణతో చెప్పాను ఎప్పుడైనా మెట్ల దారిలో ఇక్కడకి వద్దాం అని.మూడో రోజు పద్మనాభంలో చివరి రోజు.ఇంటి వెెనుక పూల మార్కెట్లో పార్వతమ్మ దగ్గర పూలు,తులసి మాల తీసుకుని వెళ్లాను.ఎవరినీ తోడు తీసుకుని వెళ్లకుండా ఒక్క దాన్నే కుంతీమాధవ స్వామి గుడికి వెెెళ్లాను.పూజారి గారు పూజ చేసిన తరువాత కమ్మని పొంగలి ప్రసాదం ఇచ్చారు.రుక్మిణమ్మ పొంగలి గుర్తు చేేసుకున్నాను.కార్తీక మాసం అమావాస్య రాత్రి కొండ దారంతా దీపాలు వెలిగిస్తారంట.”మీకు సుభద్రాచార్యులు గారు తెలుసా?”అనే ప్రశ్న అడగకుండా ఉండటం చాలా కష్టమైంది.చాలా సేపు గుడి మొత్తం తిరిగి వచ్చేస్తుంటే సాయంకాలమైంది చదివినపుడు కలిగిన దిగులు మనసును కమ్మేసింది.ఆ కధ కల్పితం అన్న స్పృహ ఉండదెందుకో.

                                           సాయంత్రం ఇంటికి వెళ్తుంటే పూల మార్కెట్ లో పార్వతమ్మ కనిపించి అడిగింది ఉదయం గుడికి వెళ్లినట్లున్నారని,పద్మనాభం వెళ్లానని చెప్తే చాలా సంతోషపడిపోయింది వాళ్ల అమ్మగారి ఊరు కురపల్లి అని చెప్పి.


6 responses to “పద్మనాభం

 1. Chandrika says:

  ఈ మధ్యనే ‘సాయంకాలమైందీ’ చదివాను. మీ టపానే గుర్తొచ్చింది

  Like

  • chitralaxman says:

   Thank you చంద్రిక గారు.పుస్తకం చదివాక నా టపా గుర్తొచ్చిందన్న విషయం నన్ను వెతుక్కుని వచ్చి నాకు చెప్పినందుకు.

   Like

 2. Naga Muralidhar Namala says:

  వైజాగ్‌లో దిగి మా ఊరు వెళ్ళేప్పుడు పద్మనాభం బోర్డు చూసుకుంటూనే వెళ్తాం. గుడి గురించి కూడా విన్నాను కానీ ఎప్పుడూ వెళ్ళటం కుదరలేదు. ఈ ఫోటోలు చూసాక ఆసక్తి కలుగుతోంది. కొండ మీద ఇంత మంచి గుడి ఉందంటే చూడాల్సిందే.

  Like

 3. సూర్య says:

  చాలా ఏళ్ల క్రింద ఊరిలో ఉండే గుడిని చూసాను కానీ కొండమీది గుడిని ేేపుడూ చూడలేదు. బావుందండీ.

  Like

  • chitralaxman says:

   Thank you Surya garu.కొండ మీదకి వెళ్లే దారి నుంచి చూస్తే క్రిందకి చూస్తే అందమైన చిత్రపటం లా కనిపిస్తుందండీ.ఎప్పుడైనా వీలైతే కొండపైకి వెళ్లటానికి ప్రయత్నించండి.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: