ధనుంజయ్….ఇంటర్మీడియట్,ఇంజనీరింగ్ టాపర్.సన్నటి పిల్లాడు.మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో ఓటు వేయటానికి వెళ్లినపుడు ఖద్దరు చొక్కా వేసుకుని ఊరిలో హడావుడి గా తిరుగుతున్నాడు లావుగా వయసుకు మించిన బరువుతో.నన్ను చూసి జీవం లేని ఒక చిరునవ్వు.తను ప్రేమించిన అమ్మాయి నాకు తెలుసు.అందమైన,నెమ్మదైన,తెలివైన అమ్మాయి.వీళ్లిద్దరినీ రోజూ దగ్గర నుంచి చూసే వాళ్ళకి కూడా వీళ్లు ప్రేమలో ఉన్నట్లు తెలియనంత హుందాగా,బాధ్యతగా ఉండేది వీళ్ల ప్రవర్తన.ధనుంజయ్ తో పెళ్ళి కోసం దాదాపు తొమ్మిదేళ్ళు ఇంట్లో నచ్చచెప్పుకుని ఎదురుచూసింది ఆ అమ్మాయి.ధనుంజయ్ వాళ్ళ నాన్న గారు సంవత్సరం ముందు అకస్మాత్తుగా చనిపోవటంతో ఇంటి బాధ్యత వీడిపై పడింది.వాళ్ళ నాన్న గారి తరువాత ఈ రాజకీయాల్లోకి వీడు రావాల్సి వచ్చింది.వీళ్ల ఇంట్లో బాధ్యతలన్నీ తీరే వరకు వేచి చూసే సహనం ఆ అమ్మాయి కుటుంబానికి లేక పోయింది. ఇద్దరి కుటుంబాలని ఒప్పించి వాళ్ళ ఇష్టంతోనే పెళ్ళి చేసుకోవాలనుకున్న ఇద్దరూ ఆ ప్రయత్నంలో ఓడిపోయి మౌనంగా దూరమయ్యారు.ఒకప్పుడు సున్నితమైన మనసున్న మహేంద్ర ఇప్పుడు ఊరి గొడవల్లో ముందుండే రాజకీయ నాయకుడు.ఇంట్లో పిన్నితో మాట్లాడుతుంటే బయట వరండాలో చిన్నాన్న దగ్గర కూర్చుని ఊర్లో ఎవరిదో గొడవ గురించి చెప్తున్నాడు.ఆ గొంతులో ఎంత కోపం,ఏదో తెగింపు.వాడి గురించి తెలిసిన వాళ్ళు వాడినిలా చూసి నమ్మలేరు.నేను వచ్చానని చిన్నాన్న చెప్పినట్లున్నారు లోపలకి వచ్చాడు మళ్లీ అదే జీవం లేని నవ్వు.వాడి మాటల కంటే మౌనమే వాడి బాధ నాకు అర్ధమయ్యేలా చేసింది.వాడి విషయంలో ఇలా జరగకుండా ఉండాల్సింది.
ఇన్ని రోజులు ఏమైపోయారు అండి? మీ పోస్టులను చాలా మిస్ అవుతున్నాను. రాస్తూ ఉండండి ప్లీజ్.
LikeLike